రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు గ్రామంలోని బిలాల్ మసీదులో శుక్రవారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందుకు రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ సలహాదారు, మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్, రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవి రామ్‌కిరణ్ పాల్గొన్నారు. షరీఫ్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రామ్ కిరణ్ మాట్లాడుతూ రంజాన్ మాసం అందరికీ శాంతి, సౌభాగ్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర నూర్‌బాష్ సాధికార కమిటీ అధ్యక్షుడు షేక్ సుభాన్ తదితరులు పాల్గొన్నారు.
పీడీఎస్‌యూ జాతీయ
ఉపాధ్యక్షుడిగా కిరణ్ కుమార్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పీడీఎస్‌యూ జాతీ య కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎస్.కిరణ్‌కుమార్ ఎన్నికయ్యా రు. ఆ వివరాలను శుక్రవారం జిల్లా ప్రధాన కార్యదర్శి భానుప్రసాద్ తెలిపా రు. యూనియన్ ప్రథమ జాతీయ మహాసభలు ఈనెల 3, 4 తేదీలలో విజయవాడలోని సింగ్ నగర్ గుజ్జల సరళా దేవి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారని, ఈ సభల్లో ఎస్.కిరణ్ కుమార్‌ను జాతీయ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నారు.


