అన్నదాన పథకానికి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

అన్నదాన పథకానికి విరాళాలు

Feb 28 2026 7:28 AM | Updated on Feb 28 2026 7:28 AM

అన్నదాన పథకానికి విరాళాలు

అన్నదాన పథకానికి విరాళాలు

ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి గాంచిన వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అన్నదాన పథకానికి పలువురు వివరాలు సమర్పించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌కు చెందిన నడింపల్లి కృష్ణ సూర్యవర్మ, కుటుంబ సభ్యులు రూ.లక్ష, ఈతకోటకు చెందిన కలిదిండి సాయిమణికంఠ, వెంకట కాశి హర్షిత్‌వర్మ రూ.50 వేలు, విశాఖపట్నం పెందుర్తి వాస్తవ్యులు మహాదేవ్‌ కార్తికేయ కుటుంబ సభ్యులు రూ.30 వేలు విరాళాలు అందించారు. దాతలకు స్వామివారి పటాలను అధికారులు, పాలకవర్గ సభ్యులు అందించారు.

కల్తీ పాలను గుర్తించడంపై

అవగాహన

అమలాపురం టౌన్‌: పాలు కల్తీ అయ్యాయో లేదో ఇంట్లోనే తెలుసుకోవడానికి సులభమైన కొన్ని పరీక్షలను అమలాపురం పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు (ఏడీఏ) డాక్టర్‌ ఎల్‌.విజయరెడ్డి వివరించారు. స్థానిక పద్మినీ పేట ప్రాంతంలోని వీరన్న డైరీ వద్ద పాడి రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. నీటి శాతం, స్టార్చ్‌, యూరియా, డిటర్జెంట్‌ వంటి కల్తీలను సులభంగా పరీక్షించవచ్చని సూచించారు. తాజా పాలు తెల్లగా, చిక్కగా ఉండి ఎక్కువ సేపు నిల్వ ఉంటే ఆ పాలు మంచివని నిర్ధారించవచ్చన్నారు. ఇంట్లోనే పాలు నాణ్యతను పరీక్షించే విధానాలను ఆయన ఆయా పరికరాలతో ప్రయోగాల ద్వారా ప్రత్యక్షంగా చూపించారు. వాటర్‌, షేక్‌ టెస్ట్‌లు తదితర విధానాలను వివరించారు. తాజా పాలు మంచి సువాసన కలిగి ఉంటాయని, రసాయనాల వాసన రావని తెలిపారు. పాలు మరిగించినప్పుడు ఆ పాలు కల్తీ స్వభావం బయట పడుతుందన్నారు. సింథటిక్‌ పాలను మరిగించినప్పుడు నురగ వచ్చి మీగడ ఏర్పదని విజయరెడ్డి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement