కోరుకొండ తీర్థం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కోరుకొండ తీర్థం ప్రారంభం

Feb 27 2026 7:34 AM | Updated on Feb 27 2026 7:34 AM

కోరుకొండ తీర్థం ప్రారంభం

కోరుకొండ తీర్థం ప్రారంభం

దేవుని కోనేరు నుంచి పుట్టమన్ను సేకరణ

ఏర్పాట్లను పరిశీలించిన

పోలీసు ఉన్నతాధికారులు

కోరుకొండ: కోరుకొండలో కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి తీర్థం గురువారం ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం నుంచి వైఖానస ఆగమ పండితుల ఆధ్వర్యంలో స్థానిక అర్చకస్వాములు స్వామివారి కోనేరు వద్ద నుంచి పుట్టమన్నును ఆలయానికి తీసుకొచ్చారు. అంకురార్పణ, ధ్వజారోహణం, నిత్య గ్రామ బలిహరణ, సేవాకాలం నిర్వహించారు. కొండపైన, కింద ఆలయాల్లో ఆరగింపు, జయగంట కార్యక్రమాలు జరిగాయి. తీర్థం సందర్భంగా కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రథోత్సవం సాగే ప్రాంతాలను అదనపు ఎస్పీ చెంచురెడ్డి, డీఎస్పీ రామ కృష్ణ పరిశీలించారు.

స్వామి మాలధారణ

నారసింహుని ఉత్సవాల సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు మాలధారణ చేశా రు. వీరంతా స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ మండపంలో తొమ్మిది రోజులుగా దీక్షలు నిర్వహించా రు. శుక్రవారం స్వామివారి రథోత్సవం, రాత్రి కల్యా ణం అనంతరం, శనివారం దీక్ష విరమించనున్నారు.

నేటి నుంచి విశిష్టాద్వైత సభలు

స్వామివారి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక రంగనాథస్వామి దేవాలయంలో ఎస్పీ నరసింహరాజభట్టర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి విశిష్టాద్వైత సభలు నిర్వహించనున్నారు. దీనికి భద్రాచలం, సింహాచలం నుంచి పండితులు హాజరవుతారు. వీరంతా స్వామి ఔన్నత్యాన్ని తెలియజేస్తారు. పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త యస్‌.పి.రంగరాజ భట్టర్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో అన్నవరం దేవస్థానం అధికారులు, అర్చక స్వాములు, కోరుకొండ ఎస్సై ఎస్‌.శ్రీనివాసు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement