ఉప్పొంగి.. ఉజ్వలమై.. | - | Sakshi
Sakshi News home page

ఉప్పొంగి.. ఉజ్వలమై..

Feb 26 2026 7:38 AM | Updated on Feb 26 2026 7:38 AM

ఉప్పొ

ఉప్పొంగి.. ఉజ్వలమై..

ఆశాజనకంగా వర్షాలు

ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురవడంతో లోయర్‌ సీలేరు జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరకుని కళకళలాడుతున్నాయి. మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం లక్ష్యానికి మించి విద్యుత్‌ ఉత్పత్తి చేసింది. సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రాలు మార్చి నాటికి లక్ష్యానికి చేరుకున్నాయి. 5, 6 యూనిట్లు అనుసంధానం పనుల వల్ల లక్ష్యానికి మించి జలవిద్యుత్‌ ఉత్పత్తి జరగలేదు.

– కేవీ రాజారావు, చీఫ్‌ ఇంజినీర్‌, పొల్లూరు

లక్ష్యానికి దగ్గరలో..

ఏపీ జెన్‌కో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి జల విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు ఏడాది పొడవునా కష్టపడుతున్నారు. ఈ ఏడాది కూడా లక్ష్యాలకు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది.

– బాలకృష్ణ, డీఈ, ఏపీ జెన్‌కో పొల్లూరు

పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రం

మోతుగూడెం: సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలోని జల విద్యుత్‌ కేంద్రాలు మూడేళ్లుగా రికార్డు స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. మాచ్‌ఖండ్‌, అప్పర్‌ సీలేరు, డొంకరాయి, పొల్లూరు, లక్ష్యానికి మించి విద్యుత్‌ ఉత్పత్తి సాధిస్తూ ఇటు జెన్‌కోకు, రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు కట్టి సుమారు 50 ఏళ్లు దాటుతున్నా, పూర్తిస్థాయిలో ఆధునీకరించకపోవడంతో ఇంజినీర్లు, కార్మికుల సమష్టి కృషితో విద్యుత్‌ ఉత్పత్తి రికార్డు స్థాయిలో సాగుతోంది. గత మూడేళ్లుగా ఉభయ గోదావరి జిల్లాలకు లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తున్నాయి. చవకగా జల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ ఇటు రైతులకు గృహ అవసరాలకు వెలుగులు నింపుతున్నాయి. మూడేళ్లుగా వర్షాలు సరిపడినంత పడడంతో రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండి విద్యుత్‌ ఉత్పత్తి బాగుంది. మూడేళ్లుగా రబీ సీజన్‌కు సుమారు 250 టీఎంసీల వరకు నీరు అందించాయి. ఏటా సీలేరు జల విద్యుత్‌ కేంద్రాలకు లక్ష్యాలు విధిస్తున్నప్పటికీ అంతకు మించే ఉత్పత్తి చేస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా విద్యుత్‌ ఉత్పత్తి చేసే జల విద్యుత్‌ కేంద్రాలుగా ఇవి రికార్డు సాధించాయి. సాగర్‌, శ్రీశైలం మన రాష్ట్రానికి ఉన్నప్పటికీ ఏడాది పొడవునా విద్యుత్‌ ఉత్పత్తి చేసే పరిస్థితి లేదు. ఈ నాలుగు కేంద్రాల నుంచి సుమారు 975 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుండడం విశేషం. ఏపీ జెన్‌కో సంస్థకు ధర్మల్‌ కేంద్రాలు ఉన్నప్పటికీ ఒక యూనిట్‌ ఉత్పత్తి చేయడానికి సుమారు రూ.7 వరకు ఖర్చు అవుతుండగా జల విద్యుత్‌ కేంద్రాల్లో యూనిట్‌కు రూ.3 ఖర్చు అవుతుంది. ఈ నాలుగు జల విద్యుత్‌ కేంద్రాలు పీక్‌ లోడ్‌ అవర్స్‌ లో జల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ భారీగా ఆదాయం సమకూరుస్తున్నాయి. ప్రస్తుతం ఒడిస్సా ఆంధ్ర ఉమ్మడి జలాశయాలు అయినా జోలాపుట్‌, బలిమెల జలాశయాల్లో ఆంధ్ర వాటాగా సుమారు 60 టీఎంసీల వరకు వస్తుండగా ఆ నీరు గుంటవాడ, డొంకరాయి జలాశయాలకు వస్తాయి. ప్రస్తుతం వాటిలో సుమారు 14 టీఎంసీల వరకు నిల్వ ఉన్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. ఈ వేసవిలో కూడా రిజర్వాయర్లలో నీటిమట్టాలు ఆశాజనకం ఉండడంతో పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి అయినట్టు వారు తెలిపారు. ఒక్క మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రమే ఈ ఏడాది లక్ష్యానికి మించి విద్యుత్‌ ఉత్పత్తి చేసినట్టు వారు అధికారులు తెలిపారు. సీలేరు, డొంకరాయి, పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రాలు మార్చి నాటికి లక్ష్యానికి చేరుకుంటాయని తెలిపారు. ఈ మూడు కేంద్రాలు సైతం ఈ ఏడాది లక్ష్యానికి చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ, పొల్లూరు రెండో దశలో కొత్తగా నిర్మిస్తున్న 5, 6 యూనిట్ల అనుసంధాన పనులు సాగుతుండడంతో సుమారు మూడు నెలల పాటు జల విద్యుదుత్పత్తికి అంతరాయం కలిగింది. లేకుంటే ఈ మూడు ప్రాజెక్టులూ లక్ష్యానికి మించి విద్యుత్‌ ఉత్పత్తి చేసేవి. అంతే కాకుండా రెండో దశ నిర్మాణంలో భాగంగా పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రం వద్ద కొత్తగా నిర్మిస్తున్న ఐదు ఆరు యూనిట్లు నిర్మాణం పూర్తయితే మరో 230 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి అందుబాటులోకి రానుంది. దీంతో సీలేరు కాంప్లెక్స్‌ ఉత్పత్తి సామర్థ్యం మొత్తం 1205 మెగావాట్లతో రాష్ట్రంలోనే అతి పెద్ద జల విద్యుత్‌ ఉత్పత్తి చేసే కేంద్రంగా రూపొందనుంది. ఈ కొత్త యూనిట్లు మరో ఏడాదిలో పూర్తికానున్నాయి.

జల విద్యుత్‌ కేంద్రాల్లో మూడేళ్ల విద్యుత్‌ ఉత్పత్తి మిలియన్‌ యూనిట్లలో..

జల విద్యుత్‌ కేంద్రం 2023–24 2024–25 2025–26

లక్ష్యం – ఉత్పత్తి లక్ష్యం – ఉత్పత్తి లక్ష్యం – ఉత్పత్తి

మాచ్‌ఖండ్‌ 626 535.576 630 554.698 657 747.52

అప్పర్‌ సీలేరు 470 485 477 495.7 477 388

పొల్లూరు 1084 1090 1095 1120.63 1084 944

డొంకరాయి 99 105.732 95 105.224 95.94 84.612

సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలో

రికార్డు స్థాయిలో జలవిద్యుత్‌

నాలుగు విద్యుత్‌ కేంద్రాల నుంచి

975 మెగావాట్ల ఉత్పత్తి

ప్రాజెక్టులు నిర్మించి 50 ఏళ్లు

అయినప్పటికీ ఆధునీకరణ అంతంతే

ఘనతంతా అధికారులు, సిబ్బందిదే

మూడేళ్లుగా లక్ష్యానికి మించి ఉత్పత్తి

ఉభయ గోదావరి జిల్లాలకు

సమృద్ధిగా తాగు, సాగునీరు

చౌక ధరలకు విద్యుత్‌ సరఫరా

ఉప్పొంగి.. ఉజ్వలమై..1
1/3

ఉప్పొంగి.. ఉజ్వలమై..

ఉప్పొంగి.. ఉజ్వలమై..2
2/3

ఉప్పొంగి.. ఉజ్వలమై..

ఉప్పొంగి.. ఉజ్వలమై..3
3/3

ఉప్పొంగి.. ఉజ్వలమై..

Advertisement
 
Advertisement
Advertisement