పాల్ ల్యాబ్స్‌తో అభ్యసనా సమర్థ్యాల పెరుగుదల
సమగ్ర శిక్షా రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి
అమలాపురం టౌన్: పాఠశాలల్లో పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ (పాల్) ద్వారా విద్యార్థుల్లో అభ్యసనా సమర్థ్యాలు పెరుగుతాయనేది పరిశోధనలతో నిరూపితమైందని సమగ్ర శిక్షా రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అమలాపురం బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని పాల్ లాబ్స్ ప్రధానోపాధ్యాయులకు సోమవారం సమీక్ష సమావేశం జరిగింది. దీనికి పాల్ లాబ్స్ జిల్లా కో ఆర్డినేటర్ పి.రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,502 పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పాల్ లాబ్స్‌తో 3.25 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారన్నారు. పాఠశాలల్లో పాల్ లాబ్స్ విస్తరించేందుకు గట్టి కృషి జరుగుతోందన్నారు. తెలుగు, ఇంగ్లిషు, గణితం సబ్జెక్ట్‌ల్లో పాల్ లాబ్స్ కంటెంట్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పాల్ లాబ్స్ వినియోగంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా తృతీయ స్థానంలో ఉందని వెల్లడించారు. సమావేశంలో సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.మమ్మీ, పాల్ ల్యాబ్ స్టేట్ కో ఆర్డినేటర్ బి.కిశోర్‌బాబు, స్టేట్ ఐఈ కో ఆర్డినేటర్ నరసింహారావు, టీచ్ టూల్ స్టేట్ కోఆర్డినేటర్ మాధవీలత, సమగ్ర శిక్షా జిల్లా సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం, జిల్లా ఐఈ కోఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. చివరిగా జిల్లాలో పాల్ ల్యాబ్ వినియోగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన ఐ.పోలవరం, సమనస, కాట్రేనకోన జెడ్పీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రవీంద్రనాథ్‌రెడ్డి మెమెంటోలు అందజేశారు.
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500
కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
గండేరా (వెయ్యి) 30,000
గటగట (వెయ్యి) 28,000
కురిడీ కొబ్బరి (కొత్తవి)
గండేరా (వెయ్యి) 29,000
గటగట (వెయ్యి) 27,000
నీటికాయ
పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000
కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,500
కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250
కిలో 350
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
పాల్ ల్యాబ్స్‌తో అభ్యసనా సమర్థ్యాల పెరుగుదల


