బాక్సింగ్‌లో బంగారు పతకం
నిడదవోలు: స్థానిక ఎస్‌వీఆర్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి బి.కార్తికేయ బాక్సింగ్ 103 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఇంటర్ కాలేజీయేట్ కం యూనివర్సిటీ బాక్సింగ్ టీమ్ (పురుషుల) ఎంపిక పోటీలను రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 7న నిర్వహించగా ప్రతిభ చాటాడు. డిసెంబర్ 15, 16వ తేదీల్లో హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర యూనివర్సిటీ జరగనున్న ఆల్ ఇండియా బాక్సింగ్ పురుషుల పోటీలకు కార్తికేయ ఎంపికై నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఓ.జ్యోతి తెలిపారు. అదే విధంగా 96 కిలోల బాక్సింగ్ విభాగంలో బీకాం ద్వితీయ సంవత్సరం విద్యార్థి పి.కార్తీక్ సిల్వర్ మెడల్ సాధించాడు. విజేతలను ప్రిన్సిపల్‌తో పాటు అధ్యాపకులు ఎం.పద్మజ, ఫిజికల్ డైరెక్టర్ సీహెచ్ సుబ్బారావు, ఎస్.నాగేశ్వరరావు, డి.ప్రదీప్ అభినందించారు.


