జాతీయ స్థాయి స్క్వాష్ పోటీలకు ఆదిత్య విద్యార్థులు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ శ్రీనగర్ ఆదిత్య పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయి స్క్వాష్ పోటీలకు ఎంపికయ్యారని ఆదిత్య పాఠశాల ప్రిన్సిపాల్ టి.రమేష్ సోమవారం తెలిపారు. విద్యార్థినులు బ్లెస్సీషానోన్ (8వ తరగతి), రూపశ్రీ (10వ తరగతి)లు ప్రతిభ చూపి ఢిల్లీలో త్యాగరాజు స్టేడియంలో జనవరి 10 నుంచి 15 వరకూ నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థులను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి, డైరెక్టర్ శృతిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ విజయ ఉమాపతి అభినందించారు.
జాతీయ స్థాయి స్క్వాష్ పోటీలకు ఆదిత్య విద్యార్థులు


