‘మోంథా’ నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
గోపాలపురం: మోంథా తుపానుకు దెబ్బ తిన్న పంటలను కేంద్ర బృందం సభ్యులు సోమవారం పరిశీలించారు. మండలంలోని చిట్యాల, వెంకటాయపాలెం, చెరుకుమిల్లి తదితర గ్రామాల్లో తుపానుకు దెబ్బ తిన్న వరి, మొక్కజొన్న, అపరాలు, ఉద్యాన పంటల నష్టాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కేంద్ర బృందానికి వివరించారు. కేంద్ర బృందం సభ్యుడు, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్ కె.పొన్నుస్వామి మాట్లాడుతూ, పంట నష్టాలపై కేంద్రానికి నివేదిస్తామని చెప్పారు. మరో సభ్యుడు, జలశక్తి మంత్రిత్వ శాఖ ఎంఏడీటీఈ సీడబ్ల్యూసీ డైరెక్టర్ శ్రీనివాస్ బైరీ, విద్యుత్ మంత్రిత్వ శాఖ సీఈఓ, డిప్యూటీ డైరెక్టర్ ఆర్తీసింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్‌కుమార్ మీనా, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారి ఢిల్లీ రావు, జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్, కొవ్వూరు ఆర్‌డీఓ రాణి సుస్మిత, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు తదితరులు పాల్గొన్నారు.


