జిల్లాతో అందెశ్రీకి అనుబంధం
రాజనగరం: కవి, సినీ గేయ రచయిత డాక్టర్ అందెశ్రీ ఇక లేరనే విషయాన్ని సాహితీ లోకం జీర్ణించుకోలేకపోతుంది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో 2018లో ఫిబ్రవరి 27న నిర్వహించిన వర్క్‌షాప్‌నకు అందెశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలం విసిరిన ఖడ్గం అక్షరమని, దానిని మంచి మార్గంలో ఉపయోగించుకుంటే లకా్‌ష్య్‌లను చేరుతామని ఉత్తేజభరతమైన ఉపన్యాసాన్ని విద్యార్థులకు అందించారు. దీనిని అంతా గుర్తు చేసుకుంటున్నారు.
సంతాపం:
అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం చాన్సలర్ కేవీవీ సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీజీయూ ప్రాంగణంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు అందెశ్రీ హాజరై ‘మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు’ అనే గేయాన్ని ఆలపించారని గుర్తు చేసుకున్నారు.
జిల్లాతో అందెశ్రీకి అనుబంధం


