కేసుల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

కేసుల పరిష్కారానికి చర్యలు

Nov 11 2025 5:57 AM | Updated on Nov 11 2025 5:57 AM

కేసుల

కేసుల పరిష్కారానికి చర్యలు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వచ్చే నెల 13న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌పై న్యాయమూర్తులతో రాజమహేంద్రవరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీ యోగ్యమైన అన్ని సివిల్‌, క్రిమినల్‌, ప్రీ లిటిగేషన్‌ కేసులు పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లోని అన్ని కేసుల జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలన్నారు. అనంతరం జిల్లా ఎకై ్సజ్‌ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు జాతీయ లోక్‌అదాలత్‌ను ఉపయోగించుకోవాలన్నారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీలక్ష్మి, కాకినాడ ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌కేడీవీ ప్రసాద్‌, తూర్పుగోదావరి జిల్లా ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సూపరింటెండెంట్‌ పీఎస్‌ రాహుల్‌, రంపచోడవరం ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సూపరింటెండెంట్‌ ఏవీబీ సుబ్రహ్మణ్య పాల్గొన్నారు.

బాలిక అపహరణ

అమలాపురం టౌన్‌: స్కూల్‌లో చదువుతున్న బాలికను ఆమె మేనమామే మాయ మాటలు చెప్పి తీసుకువెళ్లడంతో అమలాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. అమలాపురం మెయిన్‌ రోడ్డులోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సమీపంలో హైమైండ్స్‌ స్కూల్‌లో పదేళ్ల కముజు నిషిత ఐదో తరగతి చదువుతుంది. ఆమెను వరుసకు మేనమామ అయ్యే పి.గన్నవరం మండలం ముంగండకు చెందిన మట్టపర్తి సత్యమూర్తి స్కూల్‌ గేటు వద్దకు వచ్చి చాక్లెట్‌ ఇస్తానని చెప్పి తీసుకు వెళ్లినట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. ఈ మేరకు స్కూల్‌లో ఉపాధ్యాయులను ఆయన విచారించారు. నిషిత, ఆమె చెల్లెలు మోక్ష ఇద్దరూ అదే స్కూల్‌లో చదువుతున్నారు. సాయంత్రం స్కూల్‌ వదిలేసిన తర్వాత అక్కా చెల్లెళ్లు రోడ్డుపై వస్తుండగా మేనమామ సత్యమూర్తి మోటారు సైకిల్‌పై వచ్చి వారికి చాక్లెట్లు కొని ఇస్తానని ఆశ చూపాడు. స్కూల్‌ సమీపంలో వారి ఇల్లు ఉంది. రోజూ స్కూల్‌కు నడిచి వెళ్లి నడిచే ఇంటికి చేరుకుంటారు. మోటార్‌ సైకిల్‌ పెద్ద అమ్మాయి నిషిత ఎక్కింది. చిన్న అమ్మాయి మోక్ష ఎక్కలేదు. పెద్దమ్మాయి నిషిత మోటారు సైకిల్‌ ఎక్కగానే అక్కడి నుంచి సత్యమూర్తి వేగంగా వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బాలిక తండ్రి కముజు రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ చెప్పారు. బాలికను సత్యమూర్తి కిడ్నాప్‌ చేసినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు.

తల్లిదండ్రులు మందలించారని..

ప్రత్తిపాడు: తల్లిదండ్రులు మందలించారని ప్రత్తిపాడు గ్రామానికి చెందిన ఓ బాలు డు ఇంటి నుంచి వెళ్లిపోయి న ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ బి.సూర్య అప్పారావు తెలిపారు. యాళ్ల చిన్నారావు కుమారుడు నిహార్‌ సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆచూకీ తెలిసిన వారు 94407 96570 ఫోన్‌ నంబరులో సంప్రదించాలన్నారు.

బాలింతకు రెండోసారి శస్త్రచికిత్స

అమలాపురం టౌన్‌: అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శస్త్రచికిత్స వికటించడంతో ఓ బాలింతకు రెండోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని ఆ బాలింత కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని వారు తెలిపారు. అల్లవరం మండలం నక్కా రామేశ్వరానికి చెందిన పంతాడి నవ్య ఇటీవల ఆస్పత్రిలో ప్రసవించింది. ఆమెకు పిల్లలు పుట్టకుండా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. వారం రోజులకే శస్త్రచికిత్స చేసిన చోట ఇన్‌ఫెక్షన్‌ సోకిందని బంధువులు ఆరోపించారు. వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసిన సమయంలో వేసిన కు ట్లు తెగిపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పారని బంధువులు అంటున్నారు. బంధువులు, వైద్య సి బ్బంది మధ్య సోమవారం వాగ్వాదం జరిగింది.

కేసుల పరిష్కారానికి చర్యలు 1
1/1

కేసుల పరిష్కారానికి చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement