● గోదావరి తీరం.. లక్ష దీప కాంతుల సోయగం..
ఆకాశ సుందరి నక్షత్రాల మాలలు ధరించి మురిసిపోయినట్లు.. గోదావరి తీరం లక్ష దీప కాంతులను అద్దుకుని, కొత్తందాలను సంతరించుకుంది. రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యాన సోమవారం రాత్రి కార్తిక లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. కోటిలింగాల ఘాట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు పంతం కొండలరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. – సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)


