ఉత్కంఠగా కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలు
అమలాపురం టౌన్: అమలాపురం ఎర్ర వంతెన సమీపంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ పై అంతస్తులో పవర్ కిక్ షోటోకాన్ కరాటే డు అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలు ఆదివారం ఉత్కంఠగా జరిగాయి. జిల్లా స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో 100 మంది పాల్గొన్నారు. విజేతలకు కరాటే బెల్ట్‌లు, ప్రశంసా పత్రాలు పట్టణానికి చెందిన రాష్ట్ర సక్షమ్ అధ్యక్షుడు డాక్టర్ కె.శ్రీమన్నారాయణ చేతుల మీదుగా అందజేశారు. విజేతల వివరాలను అసోసియేషన్ అధ్యక్షుడు పడాల అంజి వెల్లడించారు. పోటీల్లో బ్లాక్ బెల్ట్‌లను విద్యార్థులు నందుల షణ్ముఖ్, అడపా శివశంకరి, నందుల ప్రణయ్, బండారు మోహన్, పామర్తి ఇందుప్రియ, అడబాల వినయ్, యల్లమిల్లి అన్వేష్, సరిదే హర్షిత్‌లు సాధించారని తెలిపారు. పోటీలకు ఎగ్జామినర్‌గా చిక్కం సురేష్ వ్యవహరించారు.


