రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు 8 మంది ఎంపిక
అమలాపురం టౌన్: ఆరోగ్యమే లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ స్వామి వివేకానంద యోగాశ్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి యోగా పోటీలు ఆదివారం జరిగాయి. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 80 మంది యోగా శిక్షకులు పాల్గొన్నారు. బరువు, వయస్సు ఆధారంగా కేటగిరీల వారీగా పోటీలు నిర్వహించినట్లు యోగాశ్రమ గురువు డాక్ర్ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. పదేళ్ల వయస్సు నుంచి పదిహేనేళ్ల వయస్సు ఉన్న విద్యార్ధులు పోటీల్లో యోగ ప్రతిభ కనబరిచారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేసినట్లు చెప్పారు. విజేతలకు మెమెంటోలపాటు ప్రశంస, ధృవీకరణ పత్రాలు అందజేశామన్నారు. ప్రధమ స్థానంలో నిలిచిన బి.కార్తీక్, ఎ.తేజస్వని, బి.హర్షవర్ఢన్, పి.సూర్యశవరం, టి.సాయి దివ్య, వై.రీతిక, జి. ఆదిత్య వర్థఽన్, టి.రేణుకలు రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ప్రధమ స్థానం సాధించిన ఎనిమిది మంది విజేతలు వచ్చే నెలలో రావులపాలెం సీఆర్సీలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో తలపడనున్నారు. పోటీల్లో ద్వితీయ, తృతీయ స్థానాలకు 16 మంది విజేతలను ఎంపిక చేశారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పి.సతీష్ రెడ్డి, ఎం.వెంకయ్యనాయుడు, కె.మాధవయ్య వ్యహరించారు.


