నిర్కాలో ముగిసిన పరిశోధన కమిటీ సమావేశాలు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరంలోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్)–జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ(నిర్కా)లో మూడురోజులుగా జరిగిన ఇన్‌స్టిట్యూట్ పరిశోధన కమిటీ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. సంస్థ డైరెక్టర్ డా.మాగంటి శేషుమాధవ్ అధ్యక్షతన కార్యక్రమాలు సాగాయి. ఐఆర్‌సీ సమావేశాలలో చివరిరోజు పోస్ట్ హార్వెస్ట్, వేల్యూ అడిషన్ విభాగం శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను వెల్లడించారు. డాక్టర్ విజయాభినందన, డాక్టర్ నారాయణ నిపుణులుగా వ్యవహరించారు. డా. ఎల్.కె. ప్రసాద్, డా. అనిందిత పాల్, డా. కె. సుమన్ కళ్యాణి, డా. ఎమ్. అనురాధ, డా. వై. సుబ్బయ్య, డా.బి.హేమ, డా.కె. విశ్వనాథ్‌రెడ్డి, డా.హెచ్. రవిశంకర్,, డా. నమిత దాస్ సాహా తమ పరిశోధన ఫలితాలను సమర్పించారు. వివిధ అంశాలపై సవివరమైన చర్చలు జరగగా, ముఖ్యంగా పసుపులో కర్కుమిన్, జీవ లభ్యత, అశ్వగంధలో వితనాలాయిడ్స్, వాటి ఎక్స్‌ట్రాక్షన్ విధానాల గురించి విశ్లేషణాత్మక చర్చలు సాగాయి. అభివృద్ధి పరచిన వివిధ రకాల ఆహార ఉత్పత్తులపైనా సుదీర్ఘ మైన చర్చ జరిగింది. ఐఆర్‌సీ సమావేశాలు సత్ఫలితాలతో, శాసీ్త్రయ చర్చలతో, మరియు పరిశోధనా మార్గదర్శకాలతో విజయవంతంగా ముగిసాయి.


