శానిటరీ సిబ్బందికి సెప్టెంబర్ జీతాలు
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని శానిటరీ విభాగంలో పనిచేస్తున్న 349 సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలు వారి అకౌంట్లలో జమ చేసినట్టు దేవస్థానం అధికారులు ఆదివారం తెలిపారు. శానిటరీ విభాగం సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలు ఇంకా చెల్లించకపోవడంపై గత నెల 29న ‘సాక్షి’ దినపత్రికలో ‘యథావిధిగా జీతాలు ఆలస్యం!’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆడిటర్ వద్ద జీతాల బిల్లు పెండింగ్‌లో ఉందని అందువల్ల అయిందని ఈఓ వీర్ల సుబ్బారావు వివరణ ఇచ్చారు. అయితే సాక్షిలో వార్త ప్రచురితమైన వెంటనే వస్థానం అధికారులు ఆడిటర్ వద్ద కూర్చుని జీతాల బిల్లు క్లియర్ చేయించారు. ఆ తరువాత జీతాల మొత్తాన్ని శానిటరీ కాంట్రాక్టర్ కనకదుర్గ ఏజె జమ చేయగా ఆ కాంట్రాక్టర్ నిమిషాల వ్యవధిలోనే వారి అకౌంట్లకు జమ చేశారు. గా, అక్టోబర్ నెల జీతాలను అయినా నవంబర్ పదో తేదీలోపు చెల్లించాలని శానిటరీ సిబ్బంది కోరుతున్నారు.
శానిటరీ సిబ్బందికి సెప్టెంబర్ జీతాలు


