
అంగన్వాడీల జిల్లా కమిటీ ఎన్నిక
సీటీఆర్‌ఐ: ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా రెండో మహాసభ స్థానిక విక్రమహాల్‌లో శనివారం జరిగింది. ఈ మహాసభలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, గ్రాట్యుటీ చట్టం ప్రకారం అమలు చేయాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని తీర్మానాలను ఆమోదించారు. సీహెచ్ మాణిక్యాంబ అధ్యక్షురాలిగా, కె.బేబీరాణి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా బి.రామలక్ష్మి, గౌరవ అధ్యక్షుడిగా ఎస్‌ఎస్ మూర్తి, జిల్లా ఆఫీస్ బేరర్స్‌గా సీహెచ్ అన్నపూర్ణ, బి.మార్తమ్మ, 10 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మహాసభలో అంగన్వాడీ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో, రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న పరిస్థితులను సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షలు టి.అరుణ్ వివరించారు. దేశభవిష్యత్తు అయిన బాలలను, గర్భిణీలు సంక్షేమం చూసే సేవా కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సభలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణకుమారి, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.తులసి తదితరులు పాల్గొన్నారు.