
16 బార్లకు దరఖాస్తులు నిల్
ఫ దరఖాస్తు చేయకుండా తెరవెనుక కూటమి నేతల కుట్రలు
ఫ మొత్తం 25 బార్లకు 9 బార్లకు
పూర్తయిన డ్రా
ఫ మిగిలిన వాటికి 17 వరకు
గడువు పొడిగింపు
రాజమహేంద్రవరం రూరల్: బార్ల విషయంలో అధికార కూటమి నేతలు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అధికార పార్టీ వారంతా సమావేశమై దరఖాస్తులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తయినా అన్ని బార్లకు దరఖాస్తులు రాలేదు. జిల్లాలో కల్లుగీత కార్మికుల బార్లతో కలసి 25 బార్లకుగాను 9 బార్లకు మాత్రమే డ్రా తీశారు. ఇంకా మిగిలిన 16 బార్ల విషయంలో ఎకై ్సజ్‌శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. దరఖాస్తు గడువు ఈనెల 17వ తేదీ వరకు పొడిగించినా ఒక్క దరఖాస్తు రాలేదు. అడ్డగోలు షరతులు విధించడంతో బార్లు ఏర్పాటుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.
ఒక్క దరఖాస్తూ రాలేదు
వాయిదాల మీద వాయిదాలు వేసి నోటిఫికేషన్లు మీద నోటిఫికేషన్లు విడుదల చేసినప్పటికీ జిల్లాలో మొత్తం బార్లకు దరఖాస్తులు రావడం గగనంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ కూటమి ప్రభుత్వం నూతన బార్ల పాలసీని ప్రకటించింది. జిల్లాలో ఓపెన్ కేటగిరిలో 22, రిజర్వ్ కేటగిరిలో 3 బార్లు మొత్తం కలుపుకుని 25 బార్లకు లైసెన్సులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి ఒక్కో బార్‌కు నాలుగేసి దరఖాస్తులు వస్తేనే డ్రా తీయాలని, లేకపోతే రీనోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి దరఖాస్తులు స్వీకరించడం మొదలుపెట్టింది. మొదట ఆగస్టు 26వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఆశించిన రీతిలో దరఖాస్తులు రాలేదు. దాంతో మరో రెండు రోజుల పాటు దరఖాస్తులకు గడువు పెంచింది. జిల్లాలో మద్యం దుకాణాలను బినామీల ద్వారా నిర్వహిస్తున్న కూటమి నేతల కుట్రలతోనే దరఖాస్తులు రాలేదని ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో మొత్తం మీద ఓపెన్ కేటగిరీలో 24 దరఖాస్తులు, గీత కార్మికులకు కేటాయించిన బార్ల కు 19 దరఖాస్తులు వచ్చాయి. ఆగస్టు 30న ఓపెన్ కేటగిరిలో ఆరు, రిజర్వ్ కేటగిరిలో మూడు బార్లకు డ్రా తీసి లైసెన్సులు మంజూరు చేశారు. మిగిలిన 16 బార్లు మిగిలిపోయాయి. రాజమహేంద్రవరం 13, కడియపులంక ఒకటి, కొవ్వూరు ఒకటి, నిడదవోలు ఒకటి బార్లు ఉన్నాయి. వాటి కోసం రీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయినా ఒక్క దరఖాస్తు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక ఎకై ్సజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.