నేను అన్నవరప్పాడు ఆటో యూనియన్ ప్రెసిడెంట్‌గా ఉన్నాను. గత పదేళ్లలో ఇంత దుర్భర పరిస్థితి ఏనాడూ ఎదురవలేదు. నేడు ఆటో నడుపుతున్న ప్రతి ఒక్కరూ ఫైనాన్స్‌లో అప్పు తీసుకుని ఆటో కొనుగోలు చేసిన వారే నేడు అద్దెలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజుకి రూ.1000 నుంచి నేడు రూ.500 కూడా మిగలడం లేదు.
– వాసంశెట్టి రాము, ఆటోయూనియన్ ప్రెసిడెంట్, అన్నవరప్పాడు
ఎలా పోషించాలో అర్థం కావడం లేదు
నిడదవోలు–కానూరు, కానూరు–తణుకు రోజుకి 10 ట్రిప్పులు వేసేవాడిని. నేడు రెండు, మూడు ట్రిప్పులు కూడా వేయలేకపోతున్నాం. రోజుకి ఆదాయం రూ.800 నుంచి రూ.1200 వరకు ఉండేది. నేడు రూ.500 కూడా తోలడం లేదు. మిగులు ఎలా ఉన్నా కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు. – పంజా దుర్గారావు, ఆటో డ్రైవర్, కానూరు
ఆర్థికంగా నలిగిపోతున్నాం
కుటుంబాలను పోషించలేక ఆర్థి కంగా నలిగిపోతున్నాం, రోడ్డెక్కి నా కిరాయిలు ఉండటం లేదు. ఉచిత బస్సు పథకం మా ఉపాధికి గండికొట్టింది. గతంలో ఉద యం 6 గంటలకు ఆటో ఎక్కితే సాయంత్రం 6 గంటలకు డ్యూటీ దిగేవాడిని. కానీ నేడు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు వేచి చూసినా రోజుకి రూ.500 కూడా సంపాదించలేకపోతున్నాం. జీవితం భారంగా మారింది. –ఈతకోట నాగరాజు, ఆటో డ్రైవర్, లంకమాలపల్లి
నానా ఇబ్బందులు పడుతున్నాం
నానా ఇబ్బందులు పడుతున్నాం