సర్వం సాంకేతిక మయం | - | Sakshi
Sakshi News home page

సర్వం సాంకేతిక మయం

Sep 14 2025 3:11 AM | Updated on Sep 14 2025 3:11 AM

సర్వం సాంకేతిక మయం

సర్వం సాంకేతిక మయం

కూటమి పాలనలో తప్పులు

కపిలేశ్వరపురం: ఆధునిక కాలమంతా సాంకేతికమయం. ప్రయోగాలు, పరిశోధనలే కాదు సామాన్యుడి రోజువారీ జీవితం సైతం సాంకేతిక అంశాలతో నిండిపోయింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విస్తారంగా సాంకేతిక విద్య సంస్థలున్నాయి. ఇంజినీర్లను తయారు చేసే క్రమంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న వాదన ఉంది. సెప్టెంబర్‌ 15న ఇంజినీర్స్‌ డే సందర్భంగా ఈ కథనం..

జిల్లాలో సాంకేతిక విద్యాసంస్థలివే..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 520, 29 ప్రైవేటు కళాశాలల్లో 16,800 ఇంజినీరింగ్‌ సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో కాకినాడ జిల్లాలో 8,666 మంది పరీక్ష రాయగా 6,343 మంది అర్హత పొందారు. కోనసీమలో 3,891 మందికి 2,866 మంది, తూర్పుగోదావరిలో 7,416 మందికి 6,011 మంది మొత్తం 15,220 మంది అర్హత పొందారు. కాకినాడ జిల్లాలో రెండు ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో 644 సీట్లు, 12 ప్రైవేటు కళాశాలల్లో 1,400 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 14 ప్రభుత్వ, 44 ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలున్నాయి. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలతో పాటు మరో ఐదు ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలున్నాయి. రంపచోడవవరం, రాజమహేంద్రవరంలలో ఒక్కొక్కటి చొప్పున ప్రభుత్వ, ఐదు ప్రైవేటు, కాకినాడ జిల్లాలో పిఠాపురంలో ఒకటి, కాకినాడలో రెండు ప్రభుత్వ, 9 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలున్నాయి.

సాంకేతిక విద్యపై విద్యార్థుల ఆసక్తి

జూలై 4న కాకినాడ జేఎన్‌టీయూకే విశ్వ విద్యాలయ 11వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 35 మందికి బంగారు, 99 మందికి పీహెచ్‌డీ పట్టాలు, 5 నగదు పతకాలు, అందజేశారు. సైన్స్‌ సిటీ ఆఫ్‌ ఏపీ, సమగ్ర శిక్షా, ముస్కాన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది జూలై 28న పిఠాపురంలోనూ, 29న అమలాపురంలోనూ స్పేస్‌ ఎడ్యుకేషన్‌ క్యాంపులను నిర్వహించగా విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్శిటీ క్యాంపస్‌లో జూలై 14 నుంచి 19 వరకూ క్వాంటం టెక్నాలజీపై ఏఐసీటీఈ– ఏటీఏఎల్‌ స్పాన్సర్డ్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం నిర్వహించారు. జాతీయ స్థాయి పరీక్షల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు తమ ప్రతిభను చాటారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో విద్యలో సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకూ అమలు చేశారు. 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు నిర్వహించడంతో పాటు 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబులు అందించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు స్మార్ట్‌ టీవీలు, ఉన్నత పాఠశాలలకు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ ఇచ్చారు.

సాంకేతిక విద్యపై కూటమి నిర్లక్ష్యం

డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు వేధిస్తున్నాయి. సుమారు రూ.15 వేలు చొప్పున నాలుగు నుంచి ఏడు క్వార్టర్ల వరకూ చెల్లించాల్సి ఉంది. వాటిని చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. వాటి భారాన్ని మోయలేక డీమ్డ్‌ యూనివర్శిటీలుగా మారేందుకు కళాశాలల యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తుండటం వల్ల రానున్న రోజుల్లో ఈఏపీసెట్‌ ప్రాధాన్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది.

ఆధునిక సాంకేతికతను సామాన్యుల కోసం వినియోగించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ఈ–కేవైసీ పేరుతో రేషన్‌ కార్డుల్లో కోత పెట్టిందన్న వాదన ఉంది. యాప్‌ల ద్వారా సర్వే పేరుతో దివ్యాంగులు తదితరుల పింఛన్లలో కోత పెట్టింది. మే 15న ఈసెట్‌ ఫలితాలు విడుదల చేసినప్పటికీ నెలన్నర తర్వాత జూలైన 4నుంచి కానీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇవ్వలేకపోయింది. రాష్ట్రంలో డీఎస్సీ ఒకే రోజు ఒకే సమయానికి రెండు పరీక్షలకు హాజరు కావాలంటూ హాల్‌ టికెట్లు జారీ చేయడంతో అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డులు తప్పుల తడకగా మారాయి. సాంకేతికతతో నేరాలను అదుపు చేస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నప్పటికీ అందుకు భిన్నంగా ఏడాది కాలంలో కాకినాడ జిల్లాలో సుమారు వెయ్యికిపైగా ఆన్‌లైన్‌ మోసాల కేసులు నమోదయ్యాయి.

పెరిగిన ఇంజినీర్ల ఆవశ్యకత

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో సద్వినియోగం

ఇంజినీరింగ్‌ విద్యనందించడంలో ‘కూటమి’ నిర్లక్ష్యం

సంక్షేమాన్ని ఎగ్గొట్టేందుకు

సాంకేతికత వాడకం

రేపు ఇంజినీర్స్‌ డే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement