
సెపక్‌తక్రా పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక
పి.గన్నవరం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఈనెల 11న కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి సెపక్‌తక్రా సెలక్షన్స్‌లో పీఎంసీ పి.గన్నవరం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం కోసూరి ఉమాదేవి తెలిపారు. అండర్–17 బాలికల విభాగంలో మట్టపర్తి అవంతి, అండర్–14 బాలికల విభాగంలో కడలి హిరణ్యవల్లి, అండర్–17 బాలుర విభాగంలో గుమ్మళ్ల నితీష్‌లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆమె వివరించారు. వీరిని పేరెంట్స్ కమిటీ సభ్యులతో పాటు, వ్యాయామోపాధ్యాయులు ఎం.దుర్గాప్రసాద్, కె.భీమేంద్ర తదితరులు అభినందించారు.
ఫెన్సింగ్ పోటీలకు
విద్యార్థుల ఎంపిక
అమలాపురం రూరల్: మలికిపురం మండలం మోరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ఎస్‌జీఎఫ్ ఫెన్సింగ్ జిల్లా ఎంపికల్లో అమలాపురం మండలం ఎ.వేమవరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–17 బాలుర విభాగంలో డి.భార్గవ్, అండర్–14 విభాగంలో ఎ.నాగవరుణ్ ప్రతిభ కనబరచి రాష్ట్ర పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయిని కనకదుర్గ తెలిపారు. విద్యార్థులను సర్పంచ్ రావూరి వెంకటలక్ష్మి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ దాసం విజయదుర్గ, వ్యాయామోపాధ్యాయుడు బీవీవీఎస్‌ఎన్ మూర్తి, ఎంపీటీసీ సభ్యురాలు లింగోలు సత్యవతి, నాయకులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు అభినందించారు.
మృతదేహం గుర్తింపు
ఏలేశ్వరం: పట్టణంలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం మెట్లపై మృతదేహాన్ని గుర్తించారు. వయస్సు 50 ఉంటుందని భావిస్తున్నారు. శరీరంపై నిక్కరు మినహా ఏమీలేవు. బక్కపలుచగా ఉన్నాడు. మతిస్థిమితం లేనివాడని భావిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

సెపక్‌తక్రా పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక

సెపక్‌తక్రా పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక

సెపక్‌తక్రా పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక