కత్తెరతో భార్యను హతమార్చిన భర్త | - | Sakshi
Sakshi News home page

నవ్య ఫోన్‌లో ఎవరితోనే మాట్లాడుతుందనే అనుమానంతో..

Jul 22 2024 2:50 AM | Updated on Jul 22 2024 1:29 PM

-

నిడదవోలు రూరల్‌: అనుమానం పెనుభూతం అయ్యింది.. చివరికి కట్టుకున్న భార్యనే హతమార్చేలా ఉసుగొల్పింది.. ఓ భర్త తన భార్యను కత్తెరతో పొడిచి చంపిన సంఘటన నిడదవోలు మండలం శెట్టిపేటలో ఆదివారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పెరవలి మండలం అన్నవరప్పాడుకు చెందిన నవ్య (31)కు తాపీమేస్త్రిగా పనిచేస్తున్న చిరంజీవి కుమార్‌కు పదకొండేళ్ల కిందట వివాహమైంది. శెట్టిపేటలో వీరు నివాసం ఉంటున్నారు. 

వీరికి ముగ్గురు కుమార్తెలు. నవ్య తరచూ ఫోన్‌లో ఎవరితోనే మాట్లాడుతుందనే అనుమానంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పెద్దల సమక్షంలో పలుమార్లు వీరికి నచ్చజెప్పి కాపురానికి పంపించేవారు. అదే గ్రామంలో కొద్దిరోజులుగా వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున భార్యాభర్తలు మళ్లీ గొడవపడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కత్తెరతో ఆమెను బలంగా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. 

మృతురాలి తండ్రి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని నిడదవోలు సీఐ జానకీరామయ్య పరిశీలించి హత్యకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకున్నారు. నిందితుడు చిరంజీవి కుమార్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. అమ్మ చనిపోవడంతో ముగ్గురు కుమార్తులు గుండెలవిసేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement