రఘురాం కుటుంబానికి జగ్గిరెడ్డి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

రఘురాం కుటుంబానికి జగ్గిరెడ్డి పరామర్శ

Feb 20 2026 6:33 AM | Updated on Feb 20 2026 6:33 AM

రఘురా

రఘురాం కుటుంబానికి జగ్గిరెడ్డి పరామర్శ

రావులపాలెం: పితృ వియోగంతో బాధపడుతున్న వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాంను డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి కలసి సంతాపం తెలిపారు. ఆయన వెంట నాయకులు పిల్లంక శ్రీనివాసరాజు, కర్రి నాగిరెడ్డి, మార్గన గంగాధరరావు ఉన్నారు.

ముగిసిన వాలీబాల్‌ పోటీలు

ఉప్పలగుప్తం: జాతీయ స్థాయి వాలీబాల్‌ మహిళల విభాగంలో సదరన్‌ రైల్వే జట్టు విజేతగా నిలిచింది. గొల్లవిల్లి జెడ్పీ హైస్కూల్‌లో అరిగెల శ్రీరంగయ్య (ఏఎస్‌ఆర్‌) జాతీయ స్థాయి డే అండ్‌ నైట్‌ వాలీబాల్‌ పోటీలు గురువారంతో ముగిశాయి. మహిళల విభాగంలో టీమ్‌ నుంచి ఆల్ఫోన్సా కేరళ, సదరన్‌ రైల్వే చైన్నె, ఎస్‌ఆర్‌ఎం చెంగలపట్టు, ఎస్సీఆర్‌ సికింద్రాబాద్‌ జట్లు పాల్గొన్నాయి. సదరన్‌ రైల్వే చైన్నె, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ చెంగలపట్టు జట్లు చివరి లీగ్‌ మ్యాచ్‌లో తలపడ్డాయి. సదరన్‌ జట్టు ప్రథమ, ఎస్‌ఆర్‌ఎం జట్టు రెండో స్థానాన్ని సాధించింది. పురుషుల విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో జీఎస్టీ ముంబయి జట్టు కర్ణాటక జట్టుపై 25 –17, 25– 17, 25 –23 తేడాతో విజేతగా నిలిచింది. విజేతలకు ఎమ్మెల్యే, టోర్నమెంట్‌ గౌరవ అధ్యక్షుడు అయితాబత్తుల ఆనందరావు, టోర్నమెంట్‌ అధ్యక్షుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, ముఖ్య సలహాదారు అరిగెల నానాజీ, ఉపాధ్యక్షులు మద్దింశెట్టి సురేష్‌, సలాది నాగరాజు, ప్రధాన కార్యదర్శి నరేష్‌, ఉండ్రు రాజబాబు బహుమతులు అందజేశారు.

రఘురాం కుటుంబానికి  జగ్గిరెడ్డి పరామర్శ 1
1/1

రఘురాం కుటుంబానికి జగ్గిరెడ్డి పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement