అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
పి.గన్నవరం: మంచినీటి చెరువులో పడి ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. ముంగండ గ్రామానికి చెందిన కుడుపూడి శ్రీనివాస్, నాగలక్ష్మి భార్యాభర్తలు. వీరి కుమారుడు నాగ సత్యనారాయణ పి.గన్నవరంలో ఇంటర్, కుమార్తె కరుణ ముంగండ జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నారు. గురువారం సాయంత్రం కరుణ (17) స్కూల్ ఆవరణలో వాలీబాల్ ఆడుకుని ఇంటికి వెళ్లింది. మళ్లీ సైకిల్‌పై స్కూల్ దగ్గరలో నివసిస్తున్న నాన్నమ్మ వరలక్ష్మి ఇంటికి వెళ్లింది. సాయంత్రం 6 గంటల సమయంలో నాన్నమ్మ ఇంటి పక్కనే చెరువు వద్ద ఆమె సైకిల్ ఉండటం, చెరువులో కరుణ మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి.శివకృష్ణ చెప్పారు.
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి


