అయ్యో.. మౌనిక! | Young Woman Dies In Road Accident At Moosapet | Sakshi
Sakshi News home page

అయ్యో.. మౌనిక!

Feb 12 2025 11:51 AM | Updated on Feb 12 2025 12:51 PM

Young Woman Dies In Road Accident At Moosapet

హైదరాబాద్‌, సాక్షి:  నగరంలో నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ మరో నిండు జీవితాన్ని బలిగొంది. మూసాపేట వై జంక్షన్‌ వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. 

మృతురాలిని మౌనికగా పోలీసులు నిర్ధారించారు. స్కూటీపై వెళ్తున్న మౌనికను వేగంగా వచ్చిన ఓ లారీ వచ్చి ఢీ కొట్టింది. దీంతో మౌనిక అక్కడికక్కడే మృతి చెందింది. యాక్సిడెంట్‌ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్‌ ఝామ్‌ కాగా.. పోలీసులు రంగంలోకి దిగి క్లియర్‌ చేశారు. మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement