బీజేపీ నేత దారుణ హత్య.. ఎక్కడినుంచి వచ్చారో గానీ రెప్పపాటులో..

Shocking Video: Bjp Karykarta Hacked To Death In Puducherry - Sakshi

పుదుచ్చేరిలో బీజేపీ నేత హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళం నియోజకవర్గంలో బీజేపీ పార్టీ వ్యవహారాలను కార్యకర్త సెంథిల్‌ కుమారన్ చూసుకునేవాడు. దీంతో పాటు అతను రియల్ ఎస్టేట్ డీల్స్‌లో కూడా చురుకుగా పాల్గొంటూ ఇతర వ్యాపారాలను నడుపుతుండేవాడు. అయితే ఆదివారం రాత్రి కొందరు దుండగులు హఠాత్తుగా వచ్చి రెప్పపాటు సమయంలో బాంబు విసిరి, కుమారన్‌పై మారణాయుధాలతో దాడి చేసి నరికి చంపారు.

విలియనూర్‌లోని కన్నకి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కనే ఉన్న బేకరీ దగ్గర నిలబడి ఉండగా ఈ ఘటనకు చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే కామారన్‌ని ప్రత్యర్థులు హత్య చేశారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ దాడిలో బీజేపీ కార్యకర్త అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నివేదికలో పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఏడుగురు వ్యక్తులు ఈ హత్యకు సంబంధించి తిరుచ్చి కోర్టు ముందు లొంగిపోయినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top