ఎక్స్‌ప్రెస్‌వేలో వరుస ప్రమాదాలు | road accident in expressway | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్‌వేలో వరుస ప్రమాదాలు

Jul 17 2023 8:28 AM | Updated on Jul 17 2023 8:28 AM

road accident in expressway - Sakshi

మండ్య: బెంగళూరు –మైసూరు జాతీయ రహదారిలో ఆదివారం సాయంత్రం వరుస ప్రమాదాలు జరిగి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మైసూరు నుంచి బెంగళూరు నగరానికి వస్తున్న రాజహంస బస్సు మద్దూరు బైపాస్‌ రోడ్డులోని కే. కోడిహళ్లి సమీపంలో కారును ఢీకొంది.

దీంతో కారు ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. ప్రమాదంలో సత్యనానారాయణ అనే వ్యక్తితోపాటు ఒక మహిళ, మరో వ్యక్తి గాయపడ్డారు. వీరిని మద్దూరు ఆస్పత్రికి తరలించారు.  వరుస ప్రమాదాలతో అరగంటపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement