గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

Narayankhed Software Engineer Lost Breath Due To Heart Attack - Sakshi

నారాయణఖేడ్‌: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గుండెపోటుకు గురై ఆదివారం మృతి చెందాడు. నారాయణఖేడ్‌ మండలం తుర్కపల్లికి చెందిన మురళీ గోవింద్‌(35) బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. వారం క్రితం ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడటంతో నారాయణఖేడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.

కోవిడ్‌ వార్డులో పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌ వచ్చింది. అయినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న తరుణంలో ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో మృతి చెందాడు. కాగా మురళీ గోవింత్‌ 2014, 2018లో ఖేడ్‌ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఏడాదిక్రితం ఆయన బీజేపీలో చేరారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top