
సాక్షి, హైదరాబాద్ : సనత్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త మీద కోపంతో 14 రోజుల పసికందుని భవనం పైనుంచి కిందపడేసింది ఓ తల్లి. పసికందు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఫతేనగర్ డివిజన్ నేతాజీ నగర్‌లో వేణుగోపాల్ లావణ్య దంపతుల నివసిస్తున్నారు. వీరికి 2016లో వివాహమైంది. మూడేళ్ల బాబు ఉన్నాడు.
రెండో సంతానంలో అమ్మాయి పుట్టడంతో భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి గొడవ జరగడంతో కోపంతో లావణ్య 14 రోజుల పసికందును మూడో అంతస్తు నుంచి పై నుంచి కింద పడేయడంతో చిన్నారి మృతి చెందింది. సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.