అమ్మాయితో​ లవ్‌.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఇంతలోనే అబ్బాయి షాకింగ్‌ నిర్ణయం

Man Cut His Throat Because His Elders Did Not Agree To Marry In Anantapur Dstrict - Sakshi

కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామానికి చెందిన కంసల మహేంద్ర (19) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
చదవండి: ప్రేమ పేరుతో లొంగదీసుకొని.. ప్రియుడు మోసం చేశాడంతో

ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు మహేంద్ర తెలిపాడు. ఇందుకు వారు అంగీకరించలేదు. దీంతో వారం రోజుల క్రితం ఆ యువతిని తీసుకుని బెంగళూరుకు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వచ్చి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే కులాంతర వివాహానికి పెద్దలు ఎంత మాత్రం అంగీకరించలేదు. అంతేకాక ఇరు కుటుంబాల పెద్దలు కళ్యాణదుర్గం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇరువర్గాల వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పోలీసులు, గ్రామ పెద్దలు ప్రయత్నించి, విఫలమయ్యారు. దీంతో మనస్తాపం చెందిన మహేంద్ర శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో గొంతు కోసుకున్నాడు. కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి, వెంటనే మహేంద్రను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. ఘటనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top