భార్య తల నరికి.. అనుమానితుడి గుమ్మం ముందు

Man Beheads Wife At Sangareddy Suspecting Her fidelity - Sakshi

వివాహేతర సంబంధం అనుమానంతో దారుణ హత్య  

ఇంటికి కొద్దిదూరంలో మొండెం పడేసిన వైనం

పోలీసులకు లొంగిపోయిన నిందితుడు  

నారాయణఖేడ్‌: అనుమానం పెనుభూత మైంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడో భర్త. శరీరం నుంచి తలను వేరు చేసి.. వివాహేతర సంబంధం కలిగి ఉన్న వ్యక్తి ఇంటి గుమ్మం ఎదుట పడేశాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జుర్రు సాయిలు, అనుషమ్మ (35) దంపతులు.

తన భార్యఅనంతసాగర్‌ గ్రామానికి చెందిన జైపాల్‌రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుందని సాయిలు అనుమానం వ్యక్తం చేసేవాడు. జైపాల్‌రెడ్డి నారాయణఖేడ్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వివాహేతర సంబంధం విషయమై భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తుడైన సాయిలు.. గొడ్డలితో ఆమెను నరికి చంపాడు. మొండెంను ఇంటికి కొద్ది దూరంలో పడేశాడు. తలను వేరు చేసి జైపాల్‌రెడ్డి ఇంటి గుమ్మం ముందు ఉంచాడు. అక్కడి నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది.
(చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం)
ఘటనాస్థలంలో రోధిస్తున్న కుటుంబ సభ్యులు, గుమిగూడిన గ్రామస్తులు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top