కర్కశ తల్లి లక్ష్మీ అనూష అరెస్టు.. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే | Sakshi
Sakshi News home page

కర్కశ తల్లి లక్ష్మీ అనూష అరెస్టు.. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే

Published Wed, Oct 13 2021 8:36 AM

Lakshmi Anusha Arrested In Two Children Murder Case - Sakshi

సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో కన్న బిడ్డలను కర్కశంగా హతమార్చిన లక్ష్మీ అనూషను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బిడ్డలను హత్య చేసిన రోజే నిందితురాలు ఈ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. తర్వాత తానే హత్య చేసినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో అనూష మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం కుదుటపడిందని తెలుసుకున్న పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

పిల్లలను హత్య చేస్తూ తీసుకున్న సెల్పీ వీడియోను స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని నిందితురాలి తాత మీడియాకు చెప్పారు. కొన్నాళ్లు పిల్లలను చాలా బాగానే చూసుకునేదని, ఇటీవలే ఆమెలో మార్పు వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యాడు. 

చదవండి: (రాజమహేంద్రవరంలో దారుణం..)

 
Advertisement
 
Advertisement