మైనర్‌తో టీచరమ్మ ప్రేమ పాఠాలు.. ఇద్దరు కలిసి ఫ్రెండ్‌ ఇంట్లో..

Lady Teacher Marrying Minor Student At Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై: ఆమె ఓ టీచర్‌.. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన వ్యక్తి దారుణానికి ఒడిగట్టింది. మైనర్‌కు ప్రేమ పాఠాలు చెప్పి.. మాయ మాటలతో అతడిని తన వెంట తిప్పుకుని ఓ గుడిలో పెళ్లి చేసుకుని కాపురం పెట్టింది. చివరకు పోలీసుల చేతికి చిక్కి అరెస్ట్‌ అయింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. తిరుచురాపల్లి జిల్లా తురాయుర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ విద్యార్థి(17).. 11వ తరగతి చదువుతున్నాడు. అతడు రోజులాగే మార్చి 5వ తేదీన బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన అతడి పేరెంట్స్‌ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం తెలిసి కంగుతున్నారు. విచారణలో భాగంగా.. విద్యార్థి చదివే స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళ కూడా అదే రోజు నుంచి మిస్స్‌ అయినట్టు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి ఆరా తీశారు. ఈ క్రమంలో షర్మిల తల్లి.. తన కూతురు ఫోన్​లో ఓ విద్యార్థితో మాట్లాడుతుండేదని పోలీసులకు చెప్పింది.

ఈ నేపథ్యంలో ఆమె ఫోన్‌ను ట్రాక్‌ చేసిన పోలీసులు.. తంజావూర్, వెళాంకిణి, తిరువారూర్, తిరుచిరాపల్లిలో ఫోన్​ సిగ్నల్స్​ గుర్తించారు. మార్చి 25వ తేదీన సిగ్నల్ ఆధారంగా ఆమె పుత్తూర్​లో ఉన్నట్లు కనిపెట్టారు. దీంతో అక్కడికి వెళ్లాగా.. వారిద్దరూ అప్పటికే తాంజావూర్‌లోని ఓ గుడిలో పెళ్లి చేసుకొని.. షర్మిల ఫ్రెండ్‌ ఇంట్లో కాపురం పెట్టినట్టు గుర్తించారు. కాగా, మైనర్‌ను అపహరించి, పెళ్లి కూడా చేసుకున్నందుకు షర్మిలపై పోలీసులు పోక్సో చట్లం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అనంతరం మైనర్‌కు అతడి పేరెంట్స్‌కు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top