
కార్వీ యజమాని పార్థసారథిపై జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్‌స్టేషన్‌కు పిలిచి పార్థసారథిని ఆదివారం విచారించారు. సీఆర్‌పీసీ 41 కింద ఆయనకు నోటీసులు ఇచ్చి పంపించారు.
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కార్వీ మరో వివాదంలో చిక్కుకుంది. పవర్ ప్లాంట్ షేర్ల వ్యవహారంలో గోల్‌మాల్ బయటపడింది. పవర్ ప్లాంట్ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కార్వీ యజమాని పార్థసారథిపై జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్‌స్టేషన్‌కు పిలిచి పార్థసారథిని ఆదివారం విచారించారు. సీఆర్‌పీసీ 41 కింద ఆయనకు నోటీసులు ఇచ్చి పంపించారు. ఇదిలాఉండగా.. క్లయింట్లకు సంబంధించి రూ.2,000 కోట్ల మేర విలువైన సెక్యూరిటీలను దుర్వినియోగం చేసిన విషయమై కూడా కార్వీ బ్రోకింగ్ సర్వీసెస్‌పై పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే.
చదవండి:
(కార్వీ తరహా మోసాలకు చెక్)
అలా ఎలా రుణాలిచ్చేశారు?