ఈ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు: అశోక్ రెడ్డి

I have nothing to do with the case, says RX 100 Producer Ashok Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని  ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర నిర్మాత అశోక్‌ రెడ్డి తెలిపారు. తాను ఎవరితో ఫోన్‌లో మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. తానెప్పుడూ శ్రావణిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని అశోక్‌ రెడ్డి స్పష్టం చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పారు. కాగా శ్రావణి మృతి కేసులో ఏ 3 నిందితుడుగా ఉన్న ఆయన బుధవారం పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయారు. (శ్రావణి కేసు: ట్విస్ట్‌ ఇచ్చిన పోలీసులు!)

అనంతరం అశోక్‌ రెడ్డిని వైద్య పరీక్షలు నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల ముగిసిన తర్వాత అశోక్‌ రెడ్డిని ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వార జడ్జి ముందు ప్రవేశపెట్టి...న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.  కాగా ఈ కేసులో ఇప్పటికే ఏ 1 దేవ్‌రాజ్‌ రెడ్డి, ఏ 2 సాయి కృష్ణారెడ్డి పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్న విషయం విదితమే. (శ్రావణి కేసు: నిర్మాత అశోక్‌రెడ్డి లొంగుబాటు)

అశోక్ రెడ్డి ని విచారిస్తున్న పోలీసులు..

  • శ్రావణి ని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది..??
  • ఆమెతో ఉన్న పరిచయం ఏంటి..??
  • సాయి కృష్ణ రెడ్డి తో కలిసి శ్రావణిని ఏం బెదిరించారు..??
  • శ్రావణి ని వివాహం చేసుకుంటానని ఆ తరువాత సాయి కృష్ణారెడ్డితో కలిసి ఎందుకు వేధించారు..??
  • అనేక ప్రశ్నలకు సమాధానం రాబడుతున్న ఎస్సార్ నగర్ పోలీసులు
Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top