భర్తతో గొడవలు.. బ్యూటీషియన్‌ ఆత్మహత్య  | Beauticiasn Suicide At Hafeezpet Hyderabad | Sakshi
Sakshi News home page

భర్తతో గొడవలు.. బ్యూటీషియన్‌ ఆత్మహత్య 

Dec 5 2021 6:53 AM | Updated on Dec 5 2021 8:54 AM

Beauticiasn Suicide At Hafeezpet Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భర్తతో విభేదాలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ బ్యూటీషియన్‌ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవీంద్ర ప్రసాద్‌ తెలిపిన ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన ఆన్‌మిట్‌ లేప్చా (39) భర్తకు హైదరాబాద్‌లో ఉద్యోగం రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి మాదాపూర్‌లోని విఠల్‌రావు నగర్‌లోని అలియన్స్‌ బ్లెండ్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.

చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌)

భర్తతో గొడవలు రావడంతో ఇద్దరు పిల్లలతో కలిసి రెండు సంవత్సరాలుగా విడిగా ఉంటోంది. ఈ నెల 3వ తేది అర్ధరాత్రి గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్నేహితురాలి ఫిర్యాదుతో మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: (భర్త కుట్టిన బ్లౌజ్‌ నచ్చలేదని భార్య ఆత్మహత్య)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement