‘నేను ఐపీఎస్‌ అధికారిని.. తొలిచూపులోనే నచ్చావ్‌.. పెళ్లి చేసుకుందాం’ | Sakshi
Sakshi News home page

‘నేను ఐపీఎస్‌ అధికారిని.. తొలిచూపులోనే నచ్చావ్‌.. పెళ్లి చేసుకుందాం’

Published Sat, Nov 6 2021 5:28 PM

Banjara Hills: Man Booked For Cheat Woman In Matrimony As An IAS Officer - Sakshi

సాక్షి, జవహర్‌నగర్‌: ‘మ్యాట్రిమనిలో నీ ప్రొఫైల్‌ చూశాను.. నువ్వు నాకు నచ్చావు పెళ్లి చేసుకుందామా.. నే­ను ఐపీఎస్‌ అధికారినని.. హోంమంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నాను’­అంటూ పెళ్లి చూపులకు సంబంధించిన వివరాలు పోస్ట్‌ చేసిన మహిళతో పరిచయం చేసుకున్నాడు. సదరు యువతికి అనుమానం రావడంతో అసలు విషయం బయట పడింది. సీఐ భిక్షపతిరావు తెలి­పిన వివరాల ప్రకారం.. ఓ మహిళ తన కూతురికి పెళ్లి సంబంధాలు చూడాలని తెలుగు మ్యాట్రిమోనీలో తన కూతరుకు సంబంధించిన వివరాలు పొందుపరచింది.
చదవండి: 24 ఏళ్లుగా అన్న కోసం గాలింపు.. చివరికి అతడి చేతిలోనే

ఆమె వివరాలను చూసిన పుప్పాల హరిప్రసాద్‌ (29) స్పందించి తాను ఐపీఎస్‌ అధికారినంటూ మహిళతో పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజులు వీరి మధ్య మాటలు కొనసాగాయి. ఈ క్ర­మంలో సదరు యువతికి హరిప్రసాద్‌పై అనుమానం రావడంతో నిలదీసింది. దీంతో అతడు గత నెల 27న మహిళకు ఫోన్‌ చేసి బెదిరించాడు. ఈ మేరకు బాధితురాలు జవహర్‌నగర్‌ పోలీసులకు ఫి­ర్యా­దు చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడు హరిప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. పత్తి చేనులోకి తీసుకెళ్లి 

Advertisement

తప్పక చదవండి

Advertisement