ఆన్‌లైన్‌ పాఠాల పేరుతో.. అశ్లీల చిత్రాలు..

Adilabad: Teacher Obscene Behavior With Students - Sakshi

విద్యార్థినులతో టీచర్‌ అసభ్య ప్రవర్తన

ఆదిలాబాద్‌ జిల్లా గోట్కూరిలో ఓ టీచర్‌ నిర్వాకం

డీఈవో విచారణ... సస్పెన్షన్‌ వేటు 

సాక్షి, తాంసి: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు తన వృత్తికే కళంకం తెచ్చాడు. ఆన్‌లైన్‌ పాఠాల పేరుతో ఆరో తరగతి విద్యార్థినులకు సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపించడమే కాకుండా వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం గోట్కూరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. శనివారం ఈ ఘటన చోటుచేసుకోగా ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు చేరు కుని సదరు ఉపాధ్యాయుడిని నిర్బంధించారు. గోట్కూరి పాఠశాలలో ఖదీర్‌ ఇంగ్లిష్‌ (స్కూల్‌ అసిస్టెంట్‌) ఉపాధ్యాయుడు. పాఠశాలలు పునఃప్రారం భం కావడంతో శనివారం ఆరో తరగతి విద్యార్థినులు కొందరు హాజరయ్యారు. అయితే ఖదీర్‌ వారి కి పాఠాలు చెప్పాల్సింది పోయి, తరగతి గదిలోనే తన సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపించాడు. బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని చిన్నారులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో అదేరోజు వారు ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. 

ఉపాధ్యాయుడి నిర్బంధం.. 
ఆదివారం సెలవు కావడంతో సోమవారం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు ఖదీర్‌ను తల్లిదండ్రులు, గ్రామస్తులు నిలదీశారు. అతడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న తాంసి ఎస్సై శిరీష పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన జరగకుండా చర్యలు చేపట్టా రు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుడి ఫోన్‌ను సీజ్‌ చేశారు. ఖదీర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై విచారణ నిమిత్తం డీఈవో రవీందర్‌రెడ్డి ముగ్గురు సెక్టోరియల్‌ అధికారులను పాఠశాలకు పంపించా రు. వారి నివేదిక ఆధారంగా సదరు ఉపాధ్యాయు డిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top