వరవరరావు బెయిల్ పిటిషన్ నిరాకరణ

Varavara Raobail denied by bombay highcourt - Sakshi

సాక్షి, ముంబై: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత  రచయిత  వరవరరావు (80)కు  బెయిల్‌ ఇచ్చేందుకు ముంబై హైకోర్టు నిరాకరించింది. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయనకు బెయిల్‌  ఇవ్వాలని కోరుతూ కుటుంబ సభ్యుల పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస‍్కరించింది.  అయితే నానావతి ఆస్పత్రి వైద్య బృందంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా.. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది.

తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్త నవరవరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ భార్య హేమలత ముంబై హైకోర్టును ఆశ్రయించారు. అంతకంతకూ ఆరోగ్యం క్షీణిస్తున్నా తన భర్త ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తలోజా జైలులో అమానవీయ పరిస్థితుల్లో వరవరావు మగ్గుతున్నారని ఆమె వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తన హక్కులను ఉల్లంఘనకిందికి వస్తుందన్నారు. కాగా భీమా కోరేగావ్‌ కేసులో వరవరరావు కీలక నిందితుడిగా ఎన్‌ఐఏ పేర్కొంది. జూన్, 2018లో అరెస్టు అయినప్పటి నుండి వరవరావు జైలులో ఉన్నారు. ఇటీవలి కాలంలో కరోనా బారిన పడిన వరవరావు తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top