రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ సమయం మార్పు | - | Sakshi
Sakshi News home page

రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ సమయం మార్పు

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

● టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు వైవీ రాజేశ్వరి

చిత్తూరు కార్పొరేషన్‌: చిత్తూరు రైల్వేస్టేషన్‌లో శుక్రవారం నుంచి రిజర్వేషన్‌ సిస్టమ్‌ కౌంటర్‌ సమయం మార్చినట్టు వాణిజ్య ఇన్‌స్పెక్టర్‌ అతిశయ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కౌంటర్‌ పనిచేస్తుందని తెలిపారు. గతంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 వరకు పనిచేసేదని పేర్కొన్నారు. మార్పును ప్రయాణికులు గమనించాలని కోరారు.

అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లకు జీతాలు విడుదల

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లకు జీతాలు విడుదల చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వారికి 2026 సెప్టెంబర్‌ 1 నుంచి 2027 ఏప్రెల్‌ 30 వరకు జీతాలు చెల్లించేలా బడ్జెట్‌ కేటాయించినట్టు పేర్కొన్నారు. స్కూల్‌ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్‌జీటీలకు నెలకు రూ.10 వేల చొప్పున జీతాలు చెల్లించనున్నారు. ఎస్‌ఎన్‌ఏ, స్పార్ష్‌ పద్ధతిలో డీఈవోలు డీడీవో ఖాతాలకు జీతాలు జమ చేస్తారు. చిత్తూరు జిల్లాలోని 249 మంది అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లకు 8 నెలలకు రూ.2.17 కోట్లు మంజూరు చేశారు. తిరుపతి జిల్లాలో 599 మందికి 8 నెలలకు రూ.4,98 కోట్లు మంజూరు చేశారు. మంజూరైన బడ్జెట్‌ను సంబంధిత అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లకు వెంటనే విడుదల చేయాలని, ఖర్చు వివరాలను ప్రబంద్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని డీఈవోలను ఆదేశించారు.

జాతీయ స్థాయి టెన్నిస్‌

పోటీలకు ఆర్‌కే విద్యార్థిని

చిత్తూరు కలెక్టరేట్‌ : జాతీయ స్థాయి టెన్నిస్‌ పోటీలకు ఆర్‌కే విద్యాలయ కళాశాల విద్యార్థిని సుమేరా అన్సారీ సయ్యద్‌ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ రమేష్‌బాబు వెల్లడించారు. ఆమెను బుధవారం మిట్టూరులోని కళాశాలలో అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రాష్ట్ర అండర్‌ 17 క్రీడాపోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ పోటీల్లో తమ కళాశాల విద్యార్థిని మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఆమె ఈ నెల 23న న్యూఢిల్లీ వేదికగా జరిగే జాతీయ స్థాయి టెన్నిస్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ తరఫున పాల్గొంటుందన్నారు. జాతీయ స్థాయికి ఎంపికై న సుమేరా అన్సారీని కళాశాల మేనేజింగ్‌ ట్రస్టీ డీఏ.కల్పజ, అధ్యాపక బృందం అభినందించారు.

మేయర్‌ సీటు

సీకే కుటుంబానికి ఇవ్వొద్దు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): కూటమిలో మేయర్‌ సీటును సీకే కుటుంబానికి ఇవ్వకూడదని, బీసీలో మంచి నాయకుడిని ఎంపిక చేయాలని టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు వైవీ రాజేశ్వరి డిమాండ్‌ చేశారు. ఆమె బుధవారం చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే సీకేబాబు కుటుంబానికి మేయర్‌ సీటు కేటాయిస్తే అరాచకాలు జరిగే ప్రమాదం ఉందని ఆరోపించారు. 2003లో టీడీపీ ప్రభుత్వం హయాంలో తన కుమారుడు రవిశంకర్‌ చౌదరి హత్యకు గురయ్యాడని, అందులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న సీకేబాబుపై ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అలాంటి వ్యక్తి కుటుంబానికి చెందిన లావణ్యకు మేయర్‌ సీటు ఎలా కేటాయిస్తారని టీడీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనేక బాధలను ఎదుర్కొని అంకితభావంతో కష్టపడిన సీనియర్‌ నాయకులు, త్యాగాలు చేసిన వారిని విస్మరించకూడదని కోరారు. అవసరానికి తగినట్లు పార్టీలు, కండువాలు మార్చే వారిని నమ్మి పదవులు కట్టబెడితే, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు బయట ఎలా తిరుగుతారని నిలదీశారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారికి.. బీసీ వర్గాలకు సముచిత స్థానాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement