మోగిన పురభేరి! | - | Sakshi
Sakshi News home page

మోగిన పురభేరి!

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

● 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి ● రేపటి నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ ● 21 వరకు ఉపసంహరణ ● 28న పోలింగ్‌, 30న ఫలితాలు ● కొలిక్కిరాని అభ్యర్థుల ఎంపిక ● వేడెక్కిన పట్టణ రాజకీయం ● మేయర్‌–చైర్‌పర్సన్‌ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు మునిసిపల్‌ కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేయాలి. గురువారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు. ● కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లకు సచివాలయాల్లో నామినేషన్లు ఇచ్చేలా కమిషనర్లు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ● వచ్చిన నామినేషన్లను 19వ తేదీన పరిశీలించి, అదే రోజు చెల్లుబాటు అయ్యే వాటిని ప్రకటిస్తారు. 21వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ● 28న పోలింగ్‌, 30న ఫలితాల వెల్లడి.

సాక్షి, చిత్తూరు: పురపోరుకు శంఖారావం పూరించారు. చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, కుప్పం, నగరి మునిసిపాలిటీలకు తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలకు 14 రోజు లు మాత్రమే ఉండడంతో పట్టణాల్లోని వార్డులు, డివిజన్లలో గెలుపు గుర్రాలను వెతికి పట్టుకోవడం, నాలు గు రోజుల్లో నామినేషన్లు వేయించడం ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది. ఈ క్రమంలో గుంబనంగా ఉన్న అభ్యర్థుల ఎంపిక కాస్త వేడెక్కింది. ఇదే సమయంలో మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థులు ఎవరనేది అధికార–ప్రతిపక్ష పార్టీలు ఇంకా ప్రకటించలేదు. సమీకరణలు, ప్రజాబలం ఉన్న వాళ్లను ఇప్పటి కే ఎంపిక చేసినా ప్రకటించే విషయంలో కాస్త సస్పెన్స్‌ కొనసాగుతోంది. సీట్ల పంపకాలపై కూటమిలోని పార్టీల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఇంకో 48 గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కీలక తేదీలు

మునిసిపాలిటీల వివరాలు

చిత్తూరు కార్పొరేషన్‌

డివిజన్లు 60

ఓటర్లు 1,48,583

మహిళలు 76,734

పురుషులు 71,819

ఇతరులు 30

నగరి

వార్డులు 40

ఓటర్లు 48,286

మహిళలు 24,326

పురుషులు 23,960

పలమనేరు

వార్డులు 36

ఓటర్లు 42,00

మహిళలు 21,884

పురుషులు 20,616

కుప్పం

వార్డులు 32

ఓటర్లు 40,535

మహిళలు 21,123

పురుషులు 19,404

ఇతరులు 8

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement