వైఎస్సార్‌సీపీ రీజనల్
కోఆర్డినేటర్‌గా భూమన
తిరుపతి మంగళం: వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ నియమితులయ్యారు. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డిని నియమించింది.
నేడు మద్యం దుకాణాలకు లక్కీ డిప్
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని 16 మద్యం దుకాణాల నిర్వహణ కోసం గురువారం లక్కీ డిప్ తీయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొబిషన్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలోని 19 దుకాణాలకు ఏడాది పాటు లైసెన్సులు జారీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. గడువు ముగిసే నాటికి 16 దుకాణాలకు 74 దరఖాస్తులు అందాయన్నారు. వాటిని చిత్తూరు కలెక్టరేట్‌లోని డీఆర్డీఏ సమావేశపు హాలులో కలెక్టర్ సమక్షంలో లక్కీ డిప్ చేసి దుకాణాలు కేటాయిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న నిర్వాహకులు ఉదయం ఏడు గంటలకు చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు.


