పాలసముద్రం : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాసిరకం కోడిగుడ్లు ఇస్తున్నట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అవి నాలుగు రోజులకే చెడిపోయి దుర్వాసన వస్తున్నాయని చెబుతున్నారు. తిరుమళరాజుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం కోడిగుడ్లు ఉడికించి ఒలిచేందుకు వీలుకాకపోవడంతో అన్ని గుడ్లు పగులగొట్టి ప్రై చేసి ఇచ్చారు. దీనిపై హెచ్‌ఎంను వివరణ కోరగా కోడి గుడ్లను ఉడికించి వలిచేందుకు ప్రయత్నించగా నాలుగు ముక్కలు అయిపోతున్నాయని తెలిపారు. వాటిని విద్యార్థులు కింద పడేస్తున్నారని పేర్కొన్నారు. అందవల్లే తాము సొంత నిధులతో వంటనూనె తెప్పించి గుడ్లను ప్రై చేసి ఇస్తున్నట్టు తెలిపారు.


