దాడులు చేస్తే వడ్డీతోసహా చెల్లిస్తాం | - | Sakshi
Sakshi News home page

దాడులు చేస్తే వడ్డీతోసహా చెల్లిస్తాం

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

– ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

తిరుపతి తుడా: ‘రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులపై రోజురోజుకూ అధికార పార్టీ కార్యకర్తలు, నేతల దాడులు అధికమయ్యాయి. దశరథరామిరెడ్డికి రెండు కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. తలపై తీవ్రంగా గాయపరిచా రు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు మాత్రం దుండగులపై కేసులు పెట్టకుండా దశరథరామిరెడ్డిపైనే కేసు నమోదు చేశారు. అధికారపార్టీకి కొమ్ముకాయకుండా నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేయాలి’ అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసు లు హెచ్చరించారు. మంత్రి మండిపల్లె రామ్‌ప్రసాద్‌ రెడ్డి అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దశరథరామిరెడ్డిని సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ తప్పక అధికారంలోకి వస్తుందని, ఎవరైతే తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement