పెంచలకోనకు పట్టు వస్త్రాల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

పెంచలకోనకు పట్టు వస్త్రాల సమర్పణ

Apr 29 2026 8:12 AM | Updated on Apr 29 2026 8:12 AM

కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన అధికారులు మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు. పెంచలకోన దేవస్థానం ఈవో కోవూరు జనార్దన్‌రెడ్డి, పండితులు పాల్గొన్నారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

చిత్తూరు కలెక్టరేట్‌ : ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించినట్టు డీఐఈవో రఘుపతి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారని తెలిపారు. ఈ నెల 27తో ముగిసిన గడువును ఈ నెల 30 వరకు పెంచారన్నారు.

ఆదాయపన్ను చట్టంలో వినూత్న మార్పులు

చిత్తూరు అర్బన్‌: ప్రస్తుతం అమల్లోకి తీసుకొచ్చిన ఆదాయపన్ను చట్టంలో కాలనుగుణంగా వినూత్న మార్పులు అమలు చేసినట్టు ఆదాయపన్నుశాఖ తిరుపతి రేంజ్‌ జాయింట్‌ కమిషనర్‌ డా.మురళీధరన్‌ అన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని ఓ హోటల్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆదాయపన్ను చట్టంపై డీలర్లు, ప్రజలు, ఇతర రంగాల వాళ్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాయింట్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ఇప్పటికే ఐదుమార్లు ఈ చట్టంలో మార్పు చేశారని, 1961 తరువాత తాజాగా చేసిన మార్పులు ప్రజలకు సులభతరంగా అర్థమయ్యేలా ఉందన్నారు. ఏకంగా 283 సెక్షన్లను తొలగించినట్టు తెలిపారు. ప్రజలకు ఇందులో ఎలాటి సందేహాలు ఉన్నా చిత్తూరులోని ఆదాయపన్నుశాఖ కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవచ్చన్నారు. డిప్యూటీ కమిషనర్‌ కెఎం.లక్ష్మణకుమార్‌, ఐటీవో కెవి.రమణరావు, ఇన్‌స్పెక్టర్‌ ఎం.సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

నెలరోజులు వాయిదా

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో వీబీజీరాంజీ చట్టాన్ని నెలరోజులు వాయిదా వేశారని డ్వామా అధికారులు వెల్లడించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మే నెలాఖరు వరకు కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్‌ నుంచి వీబీజీరాంజీ చట్టాన్ని అమలు చేయాలని ఇది వరకే ఉత్తర్వులు జారీచేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనిదినాలను పెంచినందు వల్ల కొత్త చట్టం అమ లును నెలరోజుల పాటు వాయిదా వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement