నష్టపరిహారం చెల్లింపు | - | Sakshi
Sakshi News home page

నష్టపరిహారం చెల్లింపు

Apr 8 2026 7:14 AM | Updated on Apr 8 2026 7:14 AM

గుడిపాల: ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేసినట్లు ఎమ్మెల్యే జగన్‌మోహన్‌, డీఎఫ్‌ఓ సుబ్బరాజ్‌ తెలిపారు. మంగళవారం గుడిపాలలో గత రెండు నెలలుగా పలు గ్రామాల పరిధిలో పంట పొలాలను ఏనుగులు ధ్వసం చేశాయి. పంట నష్టపోయిన 30 మంది రైతయులకు రూ.2.76 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో రేంజ్‌ ఆఫీసర్‌ పట్టాభి, ఎంపీపీ హరిప్రసాద్‌, జీజేఎం చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ చెన్నకేశవులునాయుడు, తహసీల్దార్‌ శ్రీనివాసులు, సింగిల్‌విండో చైర్మన్‌ ప్రతాప్‌నాయుడు పాల్గొన్నారు.

విద్యుత్‌ సమస్యల పరిష్కారం

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్ష న్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమ స్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్లపరంగా 40 సమస్యలు, ఎల్‌టీ లైన్ల పరంగా 83, కలిపి మొత్తం 123 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు.

మాజీ ఉపరాష్ట్రపతి రాక రేపు

చిత్తూరు కలెక్టరేట్‌ : మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ నెల 09న జిల్లా కేంద్రానికి విచ్చేయనున్నారు. ఈ మేరకు మాజీ ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం అధికారిక షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆయన ఈనెల 09న ఉదయం 10.30 గంటలకు చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఎన్‌పీ సావిత్ర మ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. ఆ కళాశాలలో నిర్వహించే స్నాతకోత్సవం, భవన ప్రారంభోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు.

గడువు పెంచండి

చిత్తూరు కలెక్టరేట్‌: ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌ పరీక్షల మార్కుల నమోదుకు గడువు ఈనెల 25 వరకు పెంచాలని వైఎస్‌ఆర్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వీ రెడ్డిశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో ఈనెల 15, ఉన్నత పాఠశాలల్లో 20వ తేదీ లోపు నమోదు చేయాలని విద్యాశాఖ వింత నిర్ణయాలతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని మండిపడ్డారు. పదో తరగతి మూల్యాంకన విధులకు 80 శాతం ఉపాధ్యాయులను నియమించారని, ఉన్న కొద్ది మంది పరీక్షల నిర్వహణకే ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి నమోదుకు ఈనెల 25వ తేదీ వరకు గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement