లక్ష్యాలు చేరుకోవాలి
చిత్తూరు కలెక్టరేట్ : వ్యవసాయశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యానవన పంటలు పండించే రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంఐడీహెచ్, రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన, ఆయిల్ ఫామ్ సాగులో రైతులకు రూ.32 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను గుర్తించి నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్నారు. తక్కువ సాగు ఖర్చులతో అధిక ఆదాయం పొందేందుకు రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు రూ.12 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. వివిధ పథకాలకు సంబంధించిన బిల్లులను వారానికి మూడు విడతలుగా అనుమతులు పొందాలన్నారు. జిల్లాలో నగరి, విజయపురం, నిండ్ర, కార్వేటినగరం, జీడీనెల్లూరు, ఎస్‌ఆర్ పురం మండలాల్లో ఆయిల్‌పామ్ తోటలకు 300 హెక్టార్లలో బ్సిడీని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. వచ్చే సమావేశానపికి ట్రెజరీ అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. లక్ష్యాలు సాధించడంలో బంగారుపాళ్యం, శాంతిపురం, వి.కోట క్లస్టర్ల ఉద్యానవన శాఖ అధికారులు వెనుకబడి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యానవన శాఖ ఏడీ కోటేశ్వరరావు పాల్గొన్నారు.


