బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు
– 8లో
చైన్నె–అనంతపురం హైవేలోని రొంపిచెర్ల బస్టాప్ వద్ద బస్సులు ఆపడం లేదని స్థానికులు ఆందోళన చేపట్టారు.
ఉద్యమం ఆగదు
మామిడి రైతులు ఇన్నాళ్లు గమ్మనున్నారు. గిట్టుబాటు ధర ఇస్తార ని ఊరుకున్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీలు అన్యాయంగా రూ.3, రూ.4 ఇవ్వడం దారుణం. కడుపు మండిపోతోంది. రైతులంటే అలుసుగా మారిపోయింది. ఇది పద్ధతి కాదు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే. అంత వరకు మా ఉద్యమం ఆగదు. బెదిరింపులకు భయపడేది లేదు.
– హరిబాబుచౌదరి, రైతు సంఘ నాయకుడు, చిత్తూరు మండలం
ఆరు నెలలుగా తిరుగుతున్నాం
మామిడి పంట కంటికి రెప్పలా కాపాడినా ఏం ప్రయోజనం. ఏదో పది రూపాయలు వస్తాదని ఫ్యాక్టరీకి తొలితే...ఆరు నెలలుగా బిల్లులు ఇవ్వలేదు. ఇలాగైతే రైతులు ఎలా బతకాలి. కేజీకి రూ.8 గిట్టుబాటు ధర ఇస్తామన్నారు. ఇప్పుడు రూ.3, రూ.4 ఇస్తే ఎలా..?. ఇలాగైతే రైతులంతా ఏకమవుతాం. రైతుల కడుపు కొట్టాడు..ఫ్లీజ్.
– రాజశేఖర్‌నాయుడు, తెల్లగుండ్ల వలస, చిత్తూరు మండలం
మొద్దు నిద్ర వీడాలి
సీఎం సొంత జిల్లాలో మామిడి పంట ప్రధానం. గిట్టుబాటు ధర ఇస్తామని.. ఇంత వరకు ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఫ్యాక్టరీలు రూ.8 ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. కలెక్టర్‌కు కూడా ఈ విషయాన్ని పదేపదే ప్రకటించారు. ఇప్పుడు రూ.3, రూ.4 ఇస్తుంటే..వాళ్ల మాటలకు విలువలేదా..? ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి. ఫ్యాక్టరీలతో పాలకులు కుమ్మకయ్యారనే అనుమానాలున్నాయి. ఇప్పటికై నా పార్టీలకు అతీతంగా పోరాడాలి.
– విజయానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ
నియోజకవర్గ సమన్వయకర్త, చిత్తూరు
బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు
బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు


