హైవేలో బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు
బస్ స్టాప్ వద్ద బస్సులు నిలపాలని డిమాండ్ ఆర్టీసీ డీఎం చొరవతో సమసిన వివాదం
రొంపిచెర్ల : చైన్నై– అనందపురం హైవేలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సులు బస్‌స్టాప్‌లో అగడం లేదని, దీని కారణంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మంగళవారం మధ్యాహ్నం బస్సులను అడ్డుకున్నారు. దీంతో అన్నమ్మయ్య జిల్లా, పీలేరు ఆర్టీసీ డీఎం రోషన్ వచ్చి బస్‌స్టాప్‌లోనే బస్సులు నిలుపుతామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దు మణిగింది. గత నాలుగు నెలల కాలంలో రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో రోడ్డు దాటుతూ 8 మంది మృతి చెందగా, మరో 10 మంది వరకు గాయపడ్డారు. దీనికి ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను బస్‌స్టాప్‌లో అపక పోవడమే కారణమని మండిపడ్డారు. సోమవారం రాత్రి కూడా గుర్తుతెలియని వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలసి పోతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని బస్సులను అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి రొంపిచెర్ల పోలీసులు వచ్చి ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆపై బస్సులు ఇక్కడే ఆపాల ని తెలిపారు. డీఎం అప్పటికప్పుడే బస్‌స్టాప్ వద్దనే బస్సులు నిలపాలని డ్రైవర్లను ఆదేశించడంతో సమస్య సద్దుమణిగింది.
చైన్నె– అనంతపురం హైవేలో నిలిచిన బస్సులు
రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో బస్సులను అడ్డుకున్న ప్రజలు
హైవేలో బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు


