జరిమానా
గుడుపల్లె: అక్రమంగా చింత చెట్లను నరికి తమిళనాడుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న చింత కొమ్ముల కట్టెలకు కుప్పం అటవీశాఖ అధికారి జయశంకర్ మంగళవారం జరిమానా వేశామన్నారు. మండలంలోని పెద్దగొల్లపల్లె గ్రామ సమీపంలో తమిళనాడుకు చెందిన వ్యాపారులు చింత చెట్లను నరకి తరలిచేందుకు సిద్ధంగా ఉంచారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారుల ఉత్తర్వూలు లేకపోవడంతో తమిళనాడు నుంచి వచ్చిన వ్యాపారులకు రూ.25 వేల వరకు జరిమానా విధించారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
శాంతిపురం: పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను రాళ్లబూదుగూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ నరేష్ కథనం మేరకు.. పంచా యతీ కేంద్రమైన రేగడదిన్నేపల్లి సమీపంలో కొందరు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసు సిబ్బందితో కలిసి దాడిచేశారు. పేకాట ఆడుతున్న కర్ణాటకు చెందిన ఒకరితో పాటు మొత్తం నలుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ 4,430 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు నమో దు చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
వి.కోట : పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లో సోమ వారం రాత్రి అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. అంబేడ్కర్‌నగర్ కు చెందిన వినోద్‌తో కర్ణాటక రాష్ట్రం తాయలూరు వద్ద గల గడ్డం చిన్నెపల్లెకు చెందిన మేఘన (27)కు వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఏం జరిగింతో తెలియ దు కానీ, మేఘన ఇంట్లో ఉరివేసుకుంది. తమ బిడ్డను ఆమె భర్త, కుటుంబీకులే హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించామని సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు.
చోరీ కేసులో నిందితుడికి జైలు
చిత్తూరు అర్బన్: మోటారు సైకిళ్లను చోరీ చేసిన కేసులో నిందితుడు పూజారి ఈశ్వర్ (36)కు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి మంగళవారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూ టర్ కె.ఉమాదేవి కథనం మేరకు.. బంగారు పాళ్యం, తగ్గువారిపల్లె, మురుకుల వీధి ప్రాంతాల్లో నాలుగు చోట్ల గత ఏడాది మోటారు సైకిళ్లు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో బంగారుపాళ్యం పోలీసులు కేసు నమోదుచేసి దర్యా ప్తు ప్రారంభించారు. బంగారుపాళ్యం మండలం కీరమందకు చెందిన కోటి అలియాస్ పూజారి ఈశ్వర్‌ను నిందితుడిగా గుర్తించి గత ఏడాది అక్టోబరు 13వ తేదీన అరెస్టు చేసి, నాలుగు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టుకు తరలించారు. నేరం రుజువు కావడంతో ఒక్కో కేసులో ఏడాది జైలు శిక్ష చొప్పున.. మొత్తం నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.


