ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ
చౌడేపల్లె : మండల కేంద్రంలోని హైస్కూల్ వీధిలో చర్చి పక్కన ఉన్న పెయింట్ వ్యాపారి గంగాధరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదనపల్లె డీఎస్పీ మహేంద్ర మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును విచారణ చేశారు. పెయింట్ వ్యాపారిపై పెద్ద కొండామర్రికి చెందిన శ్రీదేవి, ఆమె అల్లుడు రాజేష్‌రెడ్డి, చిన్నకొండామర్రికి చెందిన చెంగళ్రాయప్పలు దాడి చేసి పెయింట్ డబ్బాలు తీసుకెళ్లడంతోపాటు షాప్‌నకు తాళాలు వేశారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకొని డీఎస్పీ విచారణ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆయన వెంట సీఐ రాంభూపాల్, ఎస్‌ఐ నాగేశ్వరరావు ఉన్నారు.
వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
రొంపిచెర్ల: గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చైన్నై– అనంతపురం హైవేలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధుసూధన్ కథనం.. రాత్రి 11 గంటల సమయంలో రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వాహనదారులు చూసి రొంపిచెర్ల పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. రొంపిచెర్ల పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బాధితుడిని 108లో అన్నమయ్య జిల్లా, పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుంది. మృతుడి ఆచూకీ తెలియని వారు కల్లూరు సీఐ జయరాం నాయక్ 9490617885, రొంపిచెర్ల ఎస్‌ఐ 9440900709కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ


